పరాగ్వే చెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టోర్నీలో ప్రజ్ఞానందకు తొలి ఓటమి

పరాగ్వే చెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టోర్నీలో ప్రజ్ఞానందకు తొలి ఓటమి

పరాగ్వే: ఇండియా గ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. ప్రజ్ఞానంద.. పరాగ్వే చెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టోర్నీలో తొలి ఓటమిని ఎదుర్కొన్నాడు. గురువారం జరిగిన రెండో రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పర్హమ్ మగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ద్లో (ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) 47 ఎత్తులతో ప్రజ్ఞానందపై గెలిచాడు. ఈ ఓటమితో క్లాసికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రజ్ఞానంద వరుసగా 47 గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల విజయానికి తెరపడింది. దాంతో పాటు లైవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ర్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చేజార్చుకున్నాడు. 

విశ్వనాథన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆనంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మళ్లీ టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చేరుకున్నాడు. మరో గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డి. గుకేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 52 ఎత్తులతో నగుయెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ థాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)ను ఓడించాడు. విధితి గుజరాతీ.. నొడిర్బెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అబ్దుసతరోవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఉజ్బెకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) మధ్య జరిగిన గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 35 ఎత్తుల వద్ద డ్రా అయ్యింది. చాలెంజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. వైశాలి వరుసగా రెండో రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ ఓటమిపాలైంది. ఓవరాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఈ రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాత గుకేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒకటిన్నర పాయింట్లతో.. ప్రజ్ఞానంద, విధితి చెరో పాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఉన్నారు.