అభివృద్ధి, ప్రజాసంక్షేమం కోసమే ప్రజాపాలన ప్రోగ్రాం: మంత్రి పొంగులేటి

ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం అందించాలన్న ఉద్దేశంతో ప్రజాపాలన కార్యక్రమం తీసుకొచ్చామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. పేదవాడి గుమ్మం ముందుకు ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామన్నారు మంత్రి పొంగులేని శ్రీనివాస్రెడ్డి. అందులో భాగంగానే ఆరు గ్యారంటీలు పథకం తెచ్చామన్నారు.

ప్రభుత్వం ఏర్పడిన తొలిరోజే రెండు గ్యారెంటీలను అందించామన్నారు పొంగులేటి. ప్రజలనుంచి వచ్చిన ఫిర్యాదులు చిత్త శుద్ధితో పరిష్కరిస్తామన్నారు.  అప్లై చేసుకోండి.. సంక్షేమ పథకాలు మీ ఇంటిదగ్గరకే వస్తాయన్నారు. 

బీఆర్ ఎస్ హయాంలో ప్రజలకు, అధికారులకు, మంత్రులకరూ స్వేచ్ఛ లేదన్నారు మంత్రి పొంగులేని శ్రీనివాస్ రెడ్డి. మంత్రులు ఏదీచేయాలన్నా కేసీఆర్ కుటుంబం నుంచి ఆదేశాలిస్తేనే పని జరిగేదని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అంతా ఊపిరి పీల్చుకుంటున్నారని చెప్పారు. బీఆర్ ఎస్ ఎన్ని కుట్రలు చేసిన ప్రజలు నమ్మలేదన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి.