హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని, బరిలో నిలిచి గెలుస్తామని ప్రజా శాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ వెల్లడించారు. ఎన్నికల్లో పోటీ చేయనున్న 12 మంది అభ్యర్థుల లిస్ట్ ను సోమవారం ఆయన అమీర్ పేట్‌లోని పార్టీ ఆఫీసులో విడుదల చేశారు. తర్వాత పాల్ మీడియాతో మాట్లాడారు. అధికార దాహంతో కేసీఆర్, కేటీఆర్ తనను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు.
కామారెడ్డిలో తాను పోటీ చేస్తానని ప్రకటించగానే ఆ నియోజకవర్గ రైతులను మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్ కు పిలిచి.. మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారన్నారు. కాంగ్రెస్ కు వైఎస్సార్టీపీ, టీజేఎస్ మద్దతు ఇస్తుందని తాను ముందే చెప్పానని, తన మద్దతు కోసం నిర్మాత బండ్ల గణేష్ తో రేవంత్ రెడ్డి అడిగించారన్నారు.