మహాకవి కాళోజీ బయోపిక్‌ను ‘ప్రజాకవి కాళోజీ’ పేరుతో రూపొందించారు ప్రభాకర్ జైనీ. మూలవిరాట్, పద్మ,రాజ్ కుమార్, స్వప్న నటీ నటులుగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 23న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాత ప్రభాకర్ జైనీ మాట్లాడుతూ ‘మన కాలపు మహాకవి కాళోజీ గారి సందేశం, మన విద్యార్థులకైనా చేరితే, సినిమా తీసిన ప్రయోజనం నెరవేరుతుంది.
ఆ ఉద్దేశంతోనే ఈ చిత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో డిసెంబరు 23 నుంచి 29 వరకు 24 థియేటర్లలో రోజూ మార్నింగ్ షో స్కూలు పిల్లలకు ఉచితంగా ప్రదర్శిస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఈ సినిమా కమర్షియల్‌గా నడవదని, రిలీజ్ చేసే సాహసం చేయలేమని చెప్పడంతో ఇలా చేస్తున్నాం. పిల్లలకు బాగా నచ్చి, వారే రాయబారులై అందరూ సినిమా చూడాలని ఉద్యమిస్తే, రెగ్యులర్ షోస్ వేసే అవకాశం కలుగుతుంది. కనీసం ఓటీటీలో విడుదలకైనా అవకాశం కలుగుతుంది’ అని అన్నారు.