వాళ్లు దోచుకున్నారు.. మేం పంచుతున్నాం.. 

ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని షాద్​ నగర్​ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్​ అన్నారు.  బీఆర్​ఎస్​ పార్టీ ప్రజాధనాన్ని  పదేళ్లు దోచుకుందని... కాని కాంగ్రెస్​ పార్టీ ప్రజలకే వినియోగిస్తుందన్నారు.  రంగారెడ్డి జిల్లాలో ప్రజాపాలన సంబరాల్లో షాద్​ నగర్ ఎమ్మెల్యేతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..తెలంగాణలో కాంగ్రెస్​ అధికారంలోకి రావడంతోనే ప్రజా పాలన మొదలైందంటూ... పదేళ్లు కేసీఆర్​ పాలనలో ప్రజలు నానా కష్టాలు అనుభవించారన్నారు.  బీఆర్​ఎస్​ పాలనలో ఆక్రమణలు.. అవినీతి తప్ప.. అభివృద్ది లేదన్నారు. సీఎం రేవంత్​ రెడ్డి ఆధ్వర్యంలో  .. కాంగ్రెస్​ పార్టీ .. జాతీయ పార్టీగా గ్యారంటీలను అమలు చేస్తూ ప్రజల్లోకి వెళ్లిందన్నారు.   

అధికారం కోల్నోయిన బీఆర్​ఎస్​ నేతలకు మతి భ్రమించి.. అబద్దపు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ... మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత కరెంటు బిల్లులు, ఉచిత సిలిండర్ తో పాటు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు.  కాంగ్రెస్​ కార్యకర్తలు.. లీడర్లు సంక్షేమ పథకాల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలంటూ.. ఎల్లప్పుడూ కాంగ్రెస్​ పార్టీ మాత్రమే ప్రజలకు అండగా ఉంటుందన్నారు.