తెలంగాణ అంటే మినీ ఇండియా.. మంత్రి పొన్నం

 తెలంగాణ అంటే మినీ ఇండియా.. మంత్రి పొన్నం

 ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా  సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో  మంత్రి పొన్నం ప్రభాకర్​ జాతీయ  జెండాను ఆవిష్కరించారు. ..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ అంటే మినీ ఇండియా అన్నారు. దేశానికి ప్రతిరూపంగా తెలంగాణ ఉందన్నారు.  1948సెప్టెంబర్ 17న తెలంగాణ నిజాం  రాచరిక పాలన నుండి విముక్తి పొందిందన్నారు.  సాయుధ పోరాటం వల్ల విముక్తి కలిగిన తెలంగాణ.... సమైఖ్య రాష్ట్రంలో అన్ని రంగాల్లో వివక్షతకు గురైందన్నారు.  

తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ సంఘాలు కీలక పాత్ర పోషించాయన్నారు.  60 సంవత్సరాల  తెలంగాణ ప్రజల కలను డిసెంబర్​ 9 న సోనియాగాంధీ ప్రకటించారని మంత్రి పొన్నం అన్నారు.  ప్రజాపాలనను పారదర్శకంగా నిర్వహిస్తామన్న మంత్రి పొన్నం.. తెలంగాణలో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించామన్నారు.  తెలంగాణలో కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన వెంటనే  రాజీవ్​ ఆరోగ్యశ్రీ పథకాన్ని కూ. 10 లక్షలకు పెంచామన్నారు.  ఈ కార్యక్రమంలో కలెక్టర్ మను చౌదరి, సీపీ అనురాధ పాల్గొన్నారు.