గిరిజన భవన్ లో ప్రజాపాలన విజయోత్సవాలు ప్రారంభం

మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్ గిరిజన భవన్ లో ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డిసెంబర్​ 7 వరకు విజయోత్సవాలు  కొనసాగుతాయని కలెక్టర్​తెలిపారు. 

ప్రొఫెసర్ ఆలేఖ్య పంజాల చైర్ పర్సన్​  తెలంగాణ సంగీత నాటక అకాడమి ఆధ్వర్యంలోని బృందం  ప్రదర్శనలిచ్చారు. కార్యక్రమంలో అడిషషనల్​ కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, వీరబ్రహ్మ చారి, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి తదితరులున్నారు.