మంత్రి సురేఖ రిజైన్ చేయాలి: కేఏ పాల్‌‌‌‌

మంత్రి సురేఖ రిజైన్ చేయాలి: కేఏ పాల్‌‌‌‌

న్యూఢిల్లీ, వెలుగు: 72 గంటల్గోగా కొండా సురేఖ తన మంత్రి పదవికి రాజీనామా చేయా లని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్‌‌‌‌ డిమాండ్‌‌‌‌ చేశారు. అలాగే, నటుడు నాగర్జున, సమంత ఇండ్లకు వెళ్లి వారికి క్షమాపణలు చెప్పాలన్నారు. సమంత విషయంలో ఆమె వ్యాఖ్యలు మతిభ్రమించి మాట్లాడినట్లుగా ఉన్నాయని మండిపడ్డారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో కేఏ పాల్‌‌‌‌ మీడియాతో మాట్లాడారు.  కొండా సురేఖ వ్యాఖ్యలు సమంతకు ఎంత మనోవేదన, ఆవేదన కలిగించాయో ఎవరైనా ఊహించగలరా? అని ప్రశ్నించారు.