- ఆలస్యంగా ప్రారంభం కావడంతో హాల్లోకి చొచ్చుకొచ్చిన ప్రజలు
- 176 అర్జీల స్వీకరణ
కరీంనగర్ టౌన్, వెలుగు: స్థానిక కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజావాణి సోమవారం ఆలస్యంగా ప్రారంభమైంది. కలెక్టరేట్ లోని సమావేశమందిరంలో ప్రజావాణి దరఖాస్తులు తీసుకునే అధికారులు, సమీపంలోని రివ్యూ మీటింగ్ హాల్లోకి మార్చారు. విషయం తెలియక లబ్ధిదారులు ఉదయం 11.35 వరకు పడిగాపులు కాశారు. అనంతరం బాధితులంతా తోపులాడుకుంటూ రివ్యూహాల్ లోకి చొచ్చుకొచ్చారు. దీంతో పోలీసులు ఒక్కక్కరిని హాల్లోకి అనుమతించారు.
176 దరఖాస్తులు..
కలెక్టర్ ఆర్వి కర్ణన్ ఆధ్వర్యంలో ప్రజావాణి దరఖాస్తులను స్వీకరించారు. మున్సిపల్ కార్పొరేషన్ కు 26, డీపీఓ 14, డీఎండీహెచ్ఓ 1, సీపీ1, ఆర్డీఓ 9, జిల్లా సంక్షేమ అధికారి 4, తహసీల్దార్, కరీంనగర్ రూరల్ 5, తహసీల్దార్ కొత్తపల్లి 9, తహసీల్దార్ కరీంనగర్ 11 దరఖాస్తులు రాగా మిగిలిన శాఖలకు 101 దరఖాస్తులు వచ్చాయి. యుద్ధప్రాతిపదికన సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, ట్రైనీ కలెక్టర్ లెనిన్ వాత్సల్ టోప్పో, జడ్పీ సీఈఓ ప్రియాంక, ఆర్డీఓ ఆనంద్ కుమార్, మున్సిపల్ కమీషనర్ ఇస్లావత్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు తన తండ్రి రాజిరెడ్డికి చెందిన 2.30ఎకరాల భూమిలో 30 గుంటల భూమి ధరణిలో కనిపించడంలేదని ఓ ఎక్స్ సర్వీస్ మెన్ నరహరి శ్రీనివాస రెడ్డి కలెక్టర్కు మొర పెట్టుకున్నారు. ధరణిపై అధికారులను నిలదీస్తూ వాగ్వాదానికి దిగారు.