ప్రజావాణిపై బురదచల్లడం ఆపండి..హరీశ్ రావుపై ప్రజావాణి ఇన్​చార్జి చిన్నారెడ్డి ఫైర్

ప్రజావాణిపై బురదచల్లడం ఆపండి..హరీశ్ రావుపై ప్రజావాణి ఇన్​చార్జి చిన్నారెడ్డి ఫైర్

హైదరాబాద్​, వెలుగు:  తెలంగాణ ప్రజాభవన్​లో వారానికి రెండుసార్లు నిర్వహిస్తున్న ప్రజావాణిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్​రావు బురదచల్లడం ఆపాలని,  ఆయన వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుండేదని ప్రజావాణి ఇన్​చార్జి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి అన్నారు. శనివారం సెక్రటేరియెట్​ మీడియా సెంటర్​లో ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్​, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ తో కలిసి  మీడియాతో మాట్లాడారు.

ప్రజావాణి కార్యక్రమంపై హరీశ్​రావు చేస్తున్న విమర్శల్లో ఎలాంటి వాస్తవం లేదని, దీని వల్ల ఆయనపై ఉన్న  కాస్త గౌరవం కూడా మంటగలిసిపోతుందన్నారు. ప్రజావాణి ద్వారా ఇప్పటి వరకు 92 సెషన్స్ ద్వారా 92, 115 అర్జీలను స్వీకరించి, అందులో 63 శాతం సమస్యలను పరిష్కరించామని చిన్నారెడ్డి తెలిపారు.  హరీష్ రావు వీలు చేసుకుని ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి స్వయంగా చూడాలన్నారు.