ఫిర్యాదులు వెంటనే పరిష్కరించండి

సూర్యాపేట, వెలుగు : ప్రజావాణిలోని  ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను సూర్యాపేట కలెక్టర్‌‌‌‌‌‌‌‌ ఎస్‌‌‌‌‌‌‌‌.వెంకట్రావు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యాక్రమంలో ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజావాణిలో 54 దరఖాస్తులు వచ్చాయని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.  సువెన్  కంపెనీ తక్షణమే సీజ్ చేయాలని లేదా దూర ప్రాంతానికి తరలించాలని యువజన నాయకుడు దిండుగల సురేశ్​ కలెక్టర్ కు వినత పత్రం అందజేశారు. 30 ఏండ్ల కింద స్థాపించిన సువేన్ కంపెనీ వల్ల దురాజ్పల్లి, దాసాయిగూడెం, వస్త్రం తండా, రూప్లా  తండా, జాటోత్ తండా, రామ్ల తండా,  తదితర గ్రామాలు కాలుష్యం బారిన  పడుతున్నాయని వివరించారు. అనంతరం వేబిక్స్‌‌‌‌‌‌‌‌ ద్వారా కలెక్టరేట్​లోని సమావేశ మందిరం నుంచి మండల తహసీల్దార్‌‌‌‌‌‌‌‌తో ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్​ సమీక్షించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్ రెవెన్యూ ఎస్ మోహన్ రావు, జడ్పీటీఈవో సురేశ్​ కుమార్, ఇన్​చార్జి డీఆర్ఓ రాజేంద్ర కుమార్, కలెక్టరేట్  ఏవో శ్రీదేవి  వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

యాదాద్రిలో.. 
యాదాద్రి, వెలుగు :  యాదాద్రి కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణికి రెవెన్యూ డిపార్ట్​మెంట్​పై 19, మిగతా డిపార్ట్​మెంట్లపై 7 ఫిర్యాదులు వచ్చాయి.  ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సంబంధిత ఆఫీసర్లను యాదాద్రి అడిషనల్​ కలెక్టర్​ శ్రీనివాస్​రెడ్డి ఆదేశించారు. కార్యక్రమంలో ఏవో నాగేశ్వరాచారి, కలెక్టరేట్​ సూపరింటెండెండ్​ నాగలక్ష్మి, డిపార్ట్​మెంట్ల ఆఫీసర్లు పాల్గొన్నారు.  

బాధితులకు న్యాయం జరగాలి.. 
నల్గొండ అర్బన్, వెలుగు: బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని నల్గొండ ఎస్పీ కె.అపూర్వరావు అధికారులను ఆదేశించారు. గ్రీవెన్స్ డే లో భాగంగా సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో 25 మంది అర్జీదారులతో ఆమె  నేరుగా మాట్లాడారు. తమ సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. బాధితుల ప్రతి ఫిర్యాదునూ ఆన్ లైన్ లో పొందుపరుస్తూ పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. 

ప్రైవేట్​కు దీటుగా వైద్యం అందిస్తాం
ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్​రావు  

మిర్యాలగూడ, వెలుగు: ప్రైవేట్​కు దీటుగా  అవైద్యం అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్​రా వు అన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో కొత్తగా నిర్మిస్తున్న భవ న పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ఇక్కడి ఆసుపత్రిని100 పడకల నుంచి 200 పడకలకు పెంచనున్నామన్నారు. ప్రైవేట్​ ఆస్పత్రులకు దీటుగా ఇక్కడ వైద్యం అందించేందుకు ప్రత్యేక నిర్మాణాల కోసం రూ. 14 కోట్లు శాంక్షన్ చేసినట్లు తెలిపారు. ఇన్​టైంలో పనులు కంప్లీట్​ చేయాలని అధికారులను ఆదేశించారు. 

పండుగలతో ఆధ్యాత్మిక చింతన
తుంగతుర్తి, వెలుగు:  పండుగలు ఆధ్యాత్మిక చింతనకు పెంచుతాయని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్​, తుంగతుర్తి ఎమ్మెల్యే కిశోర్ కుమార్ అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి, నూతనకల్​ మండల కేంద్రాల్లో యాదవులు సౌడమ్మ తల్లి పండుగ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి వారు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం డోలు కొట్టి, కటారు విన్యాసాలు చేసి యాదవుల్లో జోష్ నింపారు.