తెలంగాణలో ప్రజావాణి కార్యక్రమం మళ్లీ ప్రారంభం

హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రజావాణి కార్యక్రమం ఇవాళ మళ్లీ ప్రారంభమైంది. లోక్‌సభ ఎన్నికల కోడ్‌ కారణంగా తాత్కాలికంగా వాయిదా పడ్డ ఈ ప్రోగ్రామ్.. కోడ్ ముగియడంతో తిరిగి స్టార్ట్ అయింది. ఇవాల్టి నుంచి ప్రజావాణి అర్జీల స్వీకరణ కార్యక్రమం యధావిధిగా కొనసాగుతుందని ప్రజావాణి ఇన్‌చార్జి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్ చిన్నారెడ్డి తెలిపారు. గతంలో వలే మంగళ, శుక్రవారాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు.  ఇక చాలా కాలం తరువాత ప్రజావాణి కార్యక్రమం తిరిగి ప్రారంభం కావడంతో పెద్దసంఖ్యలో అర్జీదారులు ప్రజాభవన్ కు చేరుకున్నారు.