ఇయ్యాల ప్రజావాణి రద్దు : కలెక్టర్ రాజర్శి షా

ఆదిలాబాద్ టౌన్, వెలుగు: కలెక్టరేట్ మీటింగ్ హాల్​లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ సోమవారం రద్దు చేసినట్లు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్శి షా ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.

రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్​లో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి సహకరించాలని కోరారు. వచ్చే సోమవారం యథావిధిగా ప్రజావాణి కొనసాగుతుందని పేర్కొన్నారు