ప్రజావాణికి 702 ఫిర్యాదులు వచ్చినయ్

 ప్రజావాణికి 702 ఫిర్యాదులు వచ్చినయ్

రెండు నెలల సుదీర్ఘ విరామం తర్వాత ప్రారంభమైన ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.  2024 జూన్ 11వ తేదీన ప్రజావాణికి 702 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగిన ఈ ప్రజావాణి కార్యక్రమంలో మంత్రి సీతక్క, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డితో పాటు ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్య ప్రజల దగ్గర నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. 

ప్రజల దగ్గర నుంచి విజ్ఞప్తులు స్వీకరించేందుకు 18 కౌంటర్లు లో ఫిర్యాదుల స్వీకరణ జరిగిందని - ప్రజా భవన్ అధికారులు వెల్లడించారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో హాజరై తమ సమస్యలను ప్రజాప్రతినిధులకు, అధికారులకు వివరించారు. 

రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 219 దరఖాస్తులు, మున్సిపల్ శాఖకు సంబంధించి 54, హోం శాఖకు సంబంధించి 52, హౌసింగ్ శాఖకు సంబంధించి 44, పౌరసరఫరాల శాఖకు సంబంధించి 46, ఇతర శాఖలకు సంబంధించి 287 దరఖాస్తులు అందినట్లుగా అధికారులు తెలిపారు.