అగ్నిప్రమాదం..రూ. 2 కోట్ల నష్టం..

అగ్నిప్రమాదం..రూ. 2 కోట్ల నష్టం..

ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలో అ‍గ్ని ప్రమాదం చోటు చేసుకుంది.  దర్శిలోని అభి షాపింగ్‌ మాల్‌లో జూన్ 24వ తేదీ శనివారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు షాపింగ్ మొత్తం వ్యాపించాయి. సమాచారాన్ని అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. అయితే షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. 

 అ‍గ్ని ప్రమాదం కారణంగా షాపింగ్‌ మాల్‌లోని బట్టలు కాలిబూడిదయ్యాయి. దీని వల్ల దాదాపు రూ.2 కోట్ల ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. దీనిపై  కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.