ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మను వివాదాలు చుట్టిముట్టాయి. ఆయనపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. గత ఎన్నికలకు ముందు వ్యూహం అనే సినిమాను తెరకెక్కించిన వర్మ.. సినిమా ప్రమోషన్స్ లో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులను, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా ‘ఎక్స్’లో పోస్టులు పెట్టారనే ఫిర్యాదుపై ఈ కేసు నమోదైంది. మద్దిపాడు మండల తెదేపా కార్యదర్శి ఎం.రామలింగం ఫిర్యాదు మేరకు మద్దిపాడు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.
Also read :- అల్పపీడనం ఎఫెక్ట్ తో.. తిరుమలలో భారీ వర్షం..
ఈ కేసులో నవంబర్ 19న తమ ఎదుట విచారణకు హాజరుకావాలంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు రాంగోపాల్‌వర్మకు నోటీసులు ఇచ్చారు. బుధవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్న మద్దిపాడు పోలీసులు.. వర్మ ఇంటివద్ద తిష్ట వేసి మరీ నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం ఏపీ పోలీసులు ఆయన ఇంటి వద్దనే ఉన్నారు. వర్మ ఈ నోటీసులపై ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరం.