
మన పొరుగు రాష్ట్రమైన ఏపీలో రాజకీయ నేతల తీరు రోజుకో చర్చకు దారితీస్తోంది. బాధ్యతాయుతమైన ప్రజా ప్రతినిధులుగా ఉండి.. ఆ పదవికే మచ్చతెచ్చే పనులు చేస్తున్నారు. పుట్టినరోజు వేడుకల పేరిట ప్రజల మధ్య రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహిస్తూ గ్రామాల్లో హంగామా సృష్టిస్తున్నారు.
బుధవారం ప్రకాశం జిల్లా దర్శి అధికార పార్టీ ఎమ్మెల్యే వేణుగోపాల్ జన్మదిన సందర్భంగా ఆ పార్టీ నేతలు రికార్డింగ్ డ్యాన్సులు మొదలెట్టారు. ఈ క్రమంలో స్థానిక నేతలు అమ్మాయిలతో కలిసి బాహుబలిలోని మనోహర అంటూ కొన్ని పాటలకు చిందులేశారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి.
దర్శిలో అమ్మాయిలతో వైసీపీ నేతల రికార్డింగ్ డాన్సులు
— Telugu Scribe (@TeluguScribe) August 3, 2023
దర్శిలో ఎమ్మెల్యే వేణుగోపాల్ జన్మదిన సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన కచేరిలో రికార్డింగ్ డ్యాన్సులు పెట్టారు.
ఈక్రమంలో స్థానిక వైసీపీ నేతలు అమ్మాయిలతో కలిసి బాహుబలిలోని మనోహర వంటి పాటలకు డ్యాన్సులు వేశారు. pic.twitter.com/i6LsIFEAWm