పవన్ కు మరో కౌంటర్.. గెల్వక ముందు ఒక అవతారం... గెలిచాక ఇంకో అవతారం..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్  ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.  పవన్ కళ్యాణ్ టార్గెట్ గా ప్రకాశ్ రాజ్  వరుస ట్వీట్లతో ప్రశ్నలు వేస్తున్నారు.  చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో! జస్ట్ ఆస్కింగ్ అంటూ సెప్టెంబర్ 25న  పవన్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు ప్రకాశ్ రాజ్.  లేటెస్ట్ గా ఇవాళ ప్రకాశ్ రాజ్ చేసిన మరో ట్వీట్ వైరల్ అవుతోంది. 

 గెలిచేముందు ఒక అవతారం... గెలిచిన తర్వాత ఇంకో అవతారం.. ఏంటీ అవాంతరం.. ఏందుకు మనకీ  అయోమయం…  ఏది నిజం?  అంటూ ప్రకాశ్ రాజ్  ప్రశ్నించారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇటీవల తిరుమల లడ్డూ వివాదంలో పవన్ కళ్యాణ్ ప్రకాశ్ రాజ్ ను ఉద్దేశించి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. హిందూ సనాతన ధర్మం గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు.దీనికి కౌంటర్ గా ప్రకాశ్ రాజ్ తాను ట్వీట్ చేసిందేంటి.?మీరు మాట్లాడేదేంటి.? మరోసారి నా ట్వీట్ చదువుకోవాలని ఓ వీడియో రిలీజ్ చేశారు. తాను విదేశాల్లో ఉన్నానని..ఇండియా వచ్చాక సెప్టెంబర్ 30 తర్వాత పవన్ ప్రశ్నలన్నింటికి సమాధానం చెబుతానని చెప్పారు ప్రకాశ్ రాజ్ . అప్పటి నుంచి రోజుకో ట్వీట్ తో ప్రశ్నలు సంధిస్తున్నారు.