నా ట్వీట్ ను మళ్లీ చదవండి.. అర్థం చేసుకోండి : పవన్ కల్యాణ్ కు ప్రకాష్ రాజ్ కౌంటర్

గత కొన్ని రోజులుగా తిరుమల లడ్డు వ్యవహారం తీవ్ర కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తిరుపతి లడ్డూ కల్తీకి వ్యతిరేకంగా గళం విప్పినందుకు తనను తప్పుబట్టే విమర్శకులపై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళవారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇందులోభాగంగా సనాతన ధర్మంపై దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. 

అలాగే గతంలో తిరుమల లడ్డు వివాదంపై నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. 'సనాతన ధర్మం'పై జరుగుతున్న దాడులపై తాను మౌనంగా ఉండబోనని స్పష్టం చేస్తూ, లౌకికవాదం అనేది వన్-వే వ్యవహారం కాదని మండిపడ్డారు.

ALSO READ | తప్పని నిరూపిస్తే.. పవన్ బూట్లు తుడుస్తాం.. ప్రభుత్వానికి అంబటి సవాల్

దీంతో ఈ విషయం తెలుసుకున్న నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారూ మీరు నా ట్వీట్ ని తప్పుగా అర్థం చేసుకున్నారని అలాగే ప్రస్తుతం తాను విదేశాలలో షూటింగ్ లో ఉన్నానని కాబట్టి సెప్టెంబర్ 30 తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించి సమాధానాలు ఇస్తానని చెప్పుకొచ్చాడు. ఈలోపు వీలైతే మరోసారి తన ట్వీట్ ని చదవాలని కోరాడు.