భారతదేశంలో మహా కుంభమేళా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇది ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది. కాగా, మహా కుంభమేళకి పలువురు పెద్దలు వెళ్లి స్నానాలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో నటుడు ప్రకాష్ రాజ్ ఫోటో ఒకటి వైరల్‌గా మారింది. దీంతో ప్రకాష్ రాజ్ క్లారిటీ ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే..
తాను కుంభమేళాకు వెళ్లినట్టు, త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోపై నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. అది ఫేక్ అంటూ X వేదికగా క్లారిటీ ఇచ్చారు. ఈ ఫోటోని క్రియేట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.
దీనిపై జనవరి 28న X వేదికగా ఫోటో షేర్ చేస్తూ స్పందించారు ప్రకాశ్ రాజ్. ఉత్తరప్రదేశ్‌లోని కుంభమేళాలో ఆయన పుణ్యస్నానం చేసినట్లు ఎవరో ఫొటో క్రియేట్ చేసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది వాస్తవం అనుకున్న కొందరు నెటిజన్లు ఆయనపై విమర్శలు గుప్పించారు.
ALSO READ | కుంభమేళా చరిత్రలో చేదు అనుభవాలు.. 1954 తొక్కిసలాటలో 800 మంది చనిపోయారు..!
'నాస్తికుడని చెప్పుకొనే మీరు కుంభమేళాకి వెళ్లారంటే ఏమనాలి? అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు. దీంతో ఆ సంబంధిత ఫొటో ప్రకాశ్ రాజ్ దృష్టికి వెళ్లగా ఫేక్ న్యూస్ అలెర్ట్ అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
FAKE NEWS ALERT
— Prakash Raj (@prakashraaj) January 28, 2025
the last resort of bigots and coward army of “Feku Maharaj” is to stoop down and spread FAKE NEWS.. even during theire Holy ceremony.. what a SHAME .. Complaint has been filed against the Jokers .. face the consequences #justasking pic.twitter.com/xpftHyrPoA
Fact Check:
DFRAC (Digital Forensics, Research and Analytics Center) ఇది ఫేక్ ఫోటో అని గుర్తించింది. నటుడు ప్రకాష్ రాజ్ పర్యటనకు సంబంధించి మాకు ఎలాంటి మీడియా కథనాలు కనిపించలేదు. నిశితంగా పరిశీలించిన తర్వాత, ప్రకాష్ రాజ్ చేతి వేళ్లలో తేడా కనిపించిందంటూ తెలిపింది.
అలాగే 'హైవ్ మోడరేషన్' మరియు 'సైటెంజైన్' వంటి AI ఇమేజ్ డిటెక్టర్లను ఉపయోగించి వైరల్ ఇమేజ్‌ని పరిశీలించామని క్లారిటీ ఇచ్చింది. దీంతో రెండు డిటెక్టర్లు పరిశీలించగా 99.9% ఖచ్చితత్వంతో ఈ ఫోటో AI చేత రూపొందించబడిందని నిర్ధారించాయి.
Hindu hater Prakash Rai, who doesn't believe in God, has gone to Kumbhamela to pollute it!
— JIX5A (@JIX5A) January 27, 2025
Now I understand what they mean by pollution! pic.twitter.com/ckV60O3Oto