నాల్గవ బెటాలియన్‌‌ అడిషనల్‌‌ కమాండెంట్‌‌గా ప్రకాశ్‌‌రావు

ఖిలా వరంగల్ వెలుగు: మామునూరు నాల్గవ బెటాలియన్ అడిషనల్ కమాండెంట్‌‌గా ఎంజీఎస్‌‌ ప్రకాశ్‌‌రావు ఛార్జ్‌‌ తీసుకున్నారు. ఇంటలిజెన్స్ సెక్యూరిటీ వింగ్‌‌లో పనిచేస్తున్న ప్రకాశ్‌‌రావు ట్రాన్స్‌‌ఫర్‌‌పై అడిషనల్ కమాండెంట్‌‌గా మామునూరుకు వచ్చారు. డ్యూటీలో చేరిన తర్వాత కమాండెంట్‌‌ శివ ప్రసాద్‌‌రెడ్డిని కలిశారు. అనంతరం అయనకు అసిస్టెంట్ కమాండెంట్లు శ్రీనివాసరావు, రాంబాబు, రిజర్వ్ ఇన్స్‌‌పెక్టర్లు శోభన్, వెంకటేశ్వర్లు, చంద్రన్న, రాజకుమార్, అశోక్ గ్రీటింగ్స్‌‌ చెప్పారు.