లక్ష్మణచాంద, వెలుగు: నిర్మల్ నియోజకవర్గ అభ్యర్థి కూచాడి శ్రీహరి రావు అత్యధిక మెజార్టీతో గెలుపొందేలా మండలంలోని నాయకులు,కార్యకర్తలు కృషి చేయాలని కర్ణాటక ఎమ్మెల్సీ ప్రకాశ్ రాథోడ్ కోరారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా బుధవారం లక్ష్మణచాంద మండలం కేంద్రంలో నూతన పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా నేతలకు దిశా నిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలను ప్రతి గడపకు చేరవేయాలన్నారు. నాయకులు పత్తిరెడ్డి రాజేశ్వర్, అలీ, నాదేడపు చిన్నూ, లక్ష్మణచాంద మండల అధ్యక్షుడు ఒడ్నాల రాజేశ్వర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నగేశ్, మాజీ సర్పంచులు ప్రతాప్ రెడ్డి, అట్ల రాంరెడ్డి పాల్గొన్నారు.
ఆరు గ్యారెంటీ హామీలను ఇంటింటికీ తీసుకెళ్లాలి
నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని రాజరాజేశ్వర గార్డెన్లో నిర్మల్, సోన్ మండలాల కాంగ్రెస్ ముఖ్య నాయకులతో ప్రకాశ్రాథోడ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరు గ్యారంటీల హామీలను ప్రతి ఇంటికి తీసుకెళ్లి పార్టీ కోసం సైనికుల్లా పని చేయాలని కోరారు. నిర్మల్ నియోజకవర్గంలోని అన్ని బూత్ కమిటీలను పూర్తిచేయాలని సూచించారు. స్థానిక మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని ఓడిస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో శ్రీహరి రావుకు మంత్రి పదవి వస్తుందన్నారు. సమావేశంలో జడ్పీటీసీ పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, నాయకులు సాద సుదర్శన్, అల్లూరి మల్లారెడ్డి, అజహర్, రాజేశ్వర్, అర్జుమన్ అలీ, ఎంబడి రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.