గీతంలో ముగిసిన ప్రమాణ 2025 ఫెస్టివల్

గీతంలో ముగిసిన ప్రమాణ 2025 ఫెస్టివల్

రామచంద్రాపురం (పటాన్​చెరు), వెలుగు: సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు పరిధిలోని గీతం డీమ్డ్​వర్శిటీ ప్రమాణ 2025 ఫెస్టివల్​ఆదివారంతో ముగిసింది. రెండు రోజులుగా జరుగుతున్న సాంస్కృతికోత్సవాలు ఈడీఎం డీజే నైట్​కార్యక్రమంతో ముగిశాయి. ఈ కార్యక్రమానికి ఎస్పీ రూపేశ్, ఎస్​వైఎన్​వైసీఎస్​ఫౌండర్​ శ్రహంజ్​హాజరయ్యారు. ఫైనల్​డేలో భాగంగా స్టూడెంట్స్​ప్రదర్శించిన పలు ఎగ్జిబిట్లు, ఆటో ఎక్స్​పో, బ్యాటిల్​ఆఫ్ బ్యాండ్స్​, ర్యాంప్​వాక్​, వెస్ర్టన్ డ్యాన్స్​లు అందరినీ ఆకట్టుకున్నాయి.

ప్రపంచ ప్రసిద్ధ జూలియా బ్లిస్​, పీఆర్ వో బ్రదర్స్​డీజే నైట్​లో స్టూడెంట్స్​ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో గీతం వీసీ డీఎస్ రావు, రెసిడెంట్ డైరెక్టర్​డీవీవీఎస్ఆర్​ వర్మ, అడ్వైజర్​త్రినాథరావు, స్టూడెంట్ లైఫ్ డైరెక్టర్​రాహుల్​మండల్​ పాల్గొన్నారు.