మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ హృదయం సినిమాతో ఆడియన్స్ ని అలరించాడు. ఈ సినిమా తర్వాత ప్రణవ్ మోహన్ లాల్ స్పెయిన్ కి వెళ్ళిపోయాడు. చదువుల నిమిత్తం వెళ్లిన ప్రణవ్ అక్కడే పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాడు. ఇందులోభాగంగా ఓ యానిమల్ ఫామ్ లో పని చేస్తున్నాడు.
దీంతో ఫార్మ్ లోని పందులు, కుక్కలు, ఇతర జంతువుల సంరక్షణ చూసుకుంటున్నట్లు ప్రణవ్ మోహన్ లాల్ తల్లి సుచిత్ర మోహన్ లాల్ తెలిపింది. అయితే ప్రణవ్ ఎక్కువగా "వర్క్ - అవే" అనే కాన్సెప్ట్ ని నమ్ముడతాడని తెలిపింది. ఇందులో చేసిన పనికి డబ్బుకి బదులు ఆహరం, వసతి వంటివి ఇస్తారు.
అలాగే ప్రణవ్ కోసం తాను ప్రతీ సంవత్సరం కొత్త స్క్రిప్ట్స్ వింటానని, కానీ ప్రణవ్ మాత్రం ఎక్కువగా ఇండస్ట్రీలో పని చెయ్యడానికంటే బయట ప్రపంచాన్ని ఎక్స్ ప్లోర్ చెయ్యడానికి బాగా ఇష్టపడతాడని తెలిపింది. అందుకే ఇలా స్టార్డమ్ కి దూరంగా నేచర్ ని ఆస్వాదిస్తూ పని చేస్తుంటాడని చెప్పుకొచ్చింది.
అలాగే తన తండ్రి పలుకుబడిని ఉపయోగించుకోవడానికి ప్రణవ్ ఎప్పుడూ ఇష్టపడడని, తనకి కావాల్సింది ఏదైనాసరే సొంతంగా సంపాదించుకుంటాడని తెలిపింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న అభిమానులు రియల్లీ గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తన్నారు.
ఈ విషయం ఇలా ఉండగా హృదయం సినిమాలో నటించిన తర్వాత ప్రణవ్ మోహన్ లాల్ మలయాళ ప్రముఖ డైరెక్టర్ వినీత్ శ్రీనివాసన్ డైరెక్ట్ చేసిన వర్షంగల్కు శేషం అనే మలయాళ సినిమాలో కనిపించాడు.