యూట్యూబర్ ప్రణీత్ హనుమంతును బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల తండ్రి కూతుళ్లపై అసభ్యకర కామెంట్లు చేసిన ప్రణీత్ హనుమంతును అరెస్ట్ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ అయ్యాయి. బెంగళూరు పోలీసులు అతడిని అరెస్ట్ చేసి.. పీటీ వారెంట్ పై హైదరాబాద్ కు తరలిస్తున్నారు.
ఓ తండ్రి తన కూతురితో కలిసి సరదాగా వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియోపై డార్క్ కామెడీ పేరుతో యుట్యూబర్ ప్రణిత్ వల్గర్ కామెంట్స్ చేశాడు. తండ్రీ కూతుళ్ళ బంధాన్ని చెడు కోణంలో చూపిస్తూ నీచంగా మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హీరో సాయి ధరమ్ తేజ్ రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో ఉండే మృగాల నుంచి పిల్లలని కాపాడుకోవాలంటూ తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేశారు. చిన్నా పెద్దా అని తేడా లేకుండా డార్క్ హ్యూమర్ పేరుతో కామెంట్స్ (రాయలేని, చెప్పలేని) చెయ్యడం ఏమిటని మెజారిటీ జనాలు ప్రణీత్ హనుమంతు మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇష్యూలో అతడికి సపోర్ట్ చేసేవారు కొందరు వున్నారు. ఓ నెటిజన్ హనుమంతుకు మద్దతుగా ట్వీట్ చేయగా... మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించడం, తెలుగు రాష్ట్రాల డీజీపీలు సైతం రియాక్ట్ అవ్వడంతో అతడి మీద కేసులు నమోదు అయ్యాయి.
ప్రణీత్ యాక్టర్ కంటే కంటెంట్ సృష్టికర్తగా నెటిజన్లలో ఎక్కువ గుర్తింపు పొందాడు. తెలుగు సినిమాలను రెగ్యులర్‌గా తిడుతూ టాలీవుడ్‌లో ఫోజులు కొడుతున్నాడంటూ నెటిజన్లు అతనిపై విమర్శలు కురిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మహేష్ బాబు వంటి అగ్ర నటుల అభిమానులు ప్రణీత్ హనుమంతును ట్రోల్ చేస్తూ ఉంటారు.తాజాగా పేదోడు జోక్స్, ఇన్‌సెస్ట్ హాస్యం పేరుతో తండ్రీ కూతుళ్ల సంబంధంపై ప్రణీత్ హనుమంతు, మరో ఇద్దరితో కలిసి అసభ్య కామెంట్లు చేశారు.