గత కొన్ని రోజులుగా తెలంగాణలో ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టిస్తోంది. విచారణలో తవ్వే కొద్దీ విషయాలు బయటపడుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో కీలక నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసిన ప్రణీత్ రావు.. ఇప్పటికే హర్డ్ డిస్కులను ఎత్తుకెళ్లిన సంగతి తెలిసిందే..
SIBలోని ట్యాపింగ్ డివైస్ మొత్తాన్ని ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్లు లేటెస్ట్ గా విచారణలో గుర్తించారు అధికారులు. డివైస్ ని ధ్వంసం చేసి అందులో హార్డ్ డిస్క్ మొత్తాన్ని పగలగొట్టినట్లు నిర్దారించారు. అడవిలో పడేసిన పలు డివైజ్ లను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ALSO READ :- Shivani Nagaram: సింగర్‌గా మారిన సుహాస్ హీరోయిన్..ఏ సినిమాకు పాడిందో తెలుసా?
మరోవైపు ప్రణీత్ రావు వెనకాల మీడియా సంస్థ యజమాని ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఒక మీడియా సంస్థ యజమాని ఇచ్చిన నెంబర్లను ప్రణీత్ రావు ట్యాప్ చేసినట్లు గుర్తించారు పోలీసులు. ఆ మీడియా సంస్థ యజమాని దగ్గర ఒక సర్వర్ పెట్టినట్లు అనుమానిస్తున్నారు. BRS కీలక నేత ఆదేశాలతో వరంగల్, సిరిసిల్లలో సర్వర్లు ఏర్పాట్లు చేసినట్లు గుర్తించారు పోలీసులు.