ప్రసన్న వదనం మూవీ టీజర్‌‌‌‌ విడుదల

సుహాస్ హీరోగా వై.కె.అర్జున్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘ప్రసన్న వదనం’. జెఎస్ మణికంఠ, టి.ఆర్. ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్స్. గురువారం ఈ మూవీ టీజర్‌‌‌‌ను విడుదల చేశారు. తల్లి తండ్రులను కూడా గుర్తు పట్టలేని ఫేస్‌‌ బ్లైండ్‌‌నెస్‌‌ అనే అరుదైన వ్యాధితో ఇబ్బందిపడే పాత్రలో సుహాస్‌‌ ఇందులో కనిపించాడు. ఇక టీజర్‌‌‌‌ లాంచ్‌‌కు అతిథిగా హాజరైన దర్శకుడు సాయి రాజేష్ మాట్లాడుతూ ‘స్టోరీలైన్ అద్భుతంగా ఉంది. 

టీజర్ సినిమాపై నమ్మకాన్ని పెంచింది. సుహాస్‌‌కు ఇది కీలకమైన సినిమా. పెద్ద విజయం సాధించాలి’ అంటూ ఆల్ ది బెస్ట్ చెప్పారు. సుహాస్ మాట్లాడుతూ ‘చాలా మంచి థ్రిల్లర్ ఇది. ఇందులో నాకు నేనే కొత్తగా అనిపించాను. సుకుమార్ గారి  అసోసియేట్ అర్జున్‌‌ అద్భుతంగా తెరకెక్కించాడు. విజయ్ బుల్గానిన్ సూపర్బ్‌‌ మ్యూజిక్ ఇచ్చారు. పక్కాగా బ్లాక్ బస్టర్ అయ్యే సినిమా ఇది’ అని చెప్పాడు. తన పాత్ర కొత్తగా ఉంటుందని రాశి సింగ్ చెప్పింది. ‘ఈ కథకు సుహాస్ యాప్ట్. సినిమా సూపర్‌‌‌‌గా వచ్చింది. అందరికీ నచ్చుతుంది’ అని దర్శకుడు అన్నాడు. ‘ప్రేక్షకులు ఆద్యంతం ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది’ అని నిర్మాతలు చెప్పారు.