
- హాజరైన మాధవానంద సరస్వతి స్వామి
పాపన్నపేట, వెలుగు: సంస్థాన్ పాపన్నపేటలో ప్రసన్నాంజనేయ స్వామి పునఃప్రతిష్ఠ ఉత్సవాలు మూడు రోజులు వైభవంగా జరిగాయి. మాఘ చవితి పురస్కరించుకొని ఆదివారం ఆలయంలో వేద బ్రాహ్మణులు శిలాంకోట ప్రవీణ్ శర్మ ఆధ్వర్యంలో.. అనంతచార్య, అరవింద శర్మ, శ్రీ నికేతన్ శర్మ, దిగంబర శర్మ, విశ్వనాథం శర్మ, నవీన్ శర్మ పూజలు నిర్వహించారు. ధ్వజ స్తంభం ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ, పూర్ణ హుతి హోమం చేశారు. రంగంపేట పీఠాధిపతి మాధావానంద సరస్వతి స్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాధవానంద స్వామి మాట్లాడుతూ.. సమయం చాలా విలువైనదన్నారు. శ్రీరాముడి జీవితం ఆదర్శమన్నారు.
ఈ ఉత్సవాల్లో మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి పాల్గొన్నారు. మధ్యాహ్నం కూరగాయల మార్కెట్ భవనంలో అన్నప్రసాద వితరణ చేపట్టారు. రాజా రాజేశ్వరి సేవా సమితి సభ్యులు భక్తులకు సేవలు అందించారు. ఆలయ కమిటీ సభ్యులు,భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.