
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (PrasanthVarma), హీరో తేజ సజ్జ(Teja Sajja) కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ హనుమాన్ (HanuMan). సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది.
లేటెస్ట్గా ఈ మూవీ 8 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్ల మార్కును అందుకుంది. ఈ మేరకు కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం హనుమాన్ మూవీ అశేషమైన ప్రేక్షక ఆదరణతో పాటు కలెక్షన్స్ కూడా అదే రేంజ్లో రాబడుతోంది. కేవలం ఇండియాలోనే కాదు ఓవర్సీస్ లెక్కల్లో కూడా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది.
Also Read : ఆరోజు కోసం ఎదురుచూస్తున్నా.. రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్
స్టార్ హీరోల సినిమాలకు సైతం రాని కలెక్షన్స్ హనుమాన్ సాధిస్తోంది. లెక్కల్లో కొత్త లెక్కలు సెట్ చేస్తూ సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తోంది. మరీ ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఆడియన్స్ హనుమాన్ క్రేజ్ నెక్స్ట్ లెవల్లో ఉంది. ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ మార్కెట్లో ఆల్ టైం టాప్ 6 గ్రాసర్గా నిలిచి రికార్డ్ క్రియేట్ చేసింది.
GLORY TO HANUMAN! ?? pic.twitter.com/a8E6w9U1Gi
— Prasanth Varma (@PrasanthVarma) January 19, 2024
ప్రస్తుతం సెకండ్ వీకెండ్ కూడా థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులతో హనుమాన్ ఆడుతుందంటే..ప్రేక్షకుల ఏ లెవెల్లో ఆదరిస్తున్నారో అర్ధం చేసుకోవొచ్చు. మరి సెకండ్ వీకెండ్ పూర్తయ్యే లోపు కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.