భారతదేశ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ ప్రసార భారతి సొంతంగా ఓ OTT యాప్ 'వేవ్స్'ని ఆవిష్కరించింది. దీని ద్వారా వినియోగదారులు టీవీ, రేడియో ప్రొగ్రామ్ లను మోబైల్ అందించనుంది. ప్రస్తుతం వేవ్స్ OTT ఫ్లాట్ ఫామ్ లో 40 ఛానల్స్ ఉన్నాయి. గోవాలోని పనాజీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా సందర్భంగా ప్రసార భారతి చైర్మన్ నవనీత్ కుమార్ సెహగల్ మాట్లాడుతూ.. క్లీన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి వేవ్స్ తీసుకువచ్చామని అన్నారు. ONDC నెట్వర్క్, గేమ్‌లు, సినిమాలతోపాటు వార్తలు, ఈసీ షాపింగ్ వంటి సర్వీస్ కూడా అందిస్తుందని మిస్టర్ సెహగల్ చెప్పారు.