ఏ శిక్షకైనా రెడీ.. సారీ మాత్రం చెప్పను

ఏ శిక్షకైనా రెడీ.. సారీ మాత్రం చెప్పను

ఏ మాత్రం తగ్గని ప్రశాంత్ భూషణ్
స్టేట్ మెంట్ మళ్లీ పరిశీలించుకోవాలన్న సుప్రీం
రెండ్రోజుల గడువు ఇచ్చిన ముగ్గురు జడ్జిల బెంచ్

న్యూఢిల్లీ: జ్యుడీషియరీకి వ్యతిరేకంగా తాను చేసిన ట్వీట్లకు సారీ చెప్పేందుకు ప్రశాంత్ భూషణ్ నిరాకరించారు. కోర్టు విధించే ఏ శిక్షకైనా రెడీ అని అన్నారు. ఈమేరకు గురువారం కోర్టు ధిక్కరణ కేసులో తన స్టేట్ మెంట్‌ను మరోసారి పరిశీలించుకోవాలని సూచిస్తూ లాయర్ ప్రశాంత్ భూషణ్‌కు
సుప్రీంకోర్టు రెండ్రోజుల గడువు ఇచ్చింది. అయితే, కోర్టు సూచనపై తన లాయర్లతో ఆలోచిస్తానని ప్రశాంత్‌ భూషణ్‌ చెప్పారు. కోర్టు ధిక్కరణ కేసుపై జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కృష్ణ మురారీ లతో కూడిన బెంచ్ గురువారం విచారణ చేపట్టింది. ప్రశాంత్ భూషణ్ కు ఎలాంటి
పనిష్ మెంట్ ఇవ్వొద్దని అటార్నీజనరల్ కె.కె వేణుగోపాల్ బెంచ్ ను కోరారు. సారీ చెప్పేది లేదన్న స్టాండ్ ను రీకన్సిడర్ చేసుకుంటేనే ఈ విజ్ఞప్తిని పరిశీలిస్తామని బెంచ్ స్పష్టం చేసింది. ఆయన ఇచ్చిన స్టేట్ మెంట్ పరిస్థితిని మరింత దిగజారుస్తోందని తెలిపింది. తప్పు తెలుసుకుంటే మంచిదంది. శిక్ష ఖరారును వేరే బెంచ్ కు బదిలీ చేయాలని ప్రశాంత్ భూషణ్ తరపున సీనియర్ లాయర్ దుష్యంత్ దవే చేసిన విజ్ఞప్తిని బెంచ్ తిరస్కరించింది. తాము రివ్యూపిటిషన్ ఫైల్ చేస్తామని, శిక్షపై తీర్పును వాయిదా వేయాలని దవే కోరినా బెంచ్ అంగీకరించలేదు. తర్వాతి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. ‘నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. కోర్టు తీర్పు నన్ను ఆశ్చర్యానికి, నిరాశకు గురి చేసింది. రాజ్యాంగ పరిరక్షణకు ప్రజాస్వామ్యంలో ఓపెన్ క్రిటిసిజం అవసరం. నా డ్యూటీలో భాగంగానే ట్వీట్లు చేశా. క్షమాపణ అడగను. కోర్టు ఏ శిక్ష విధించినా స్వీకరిస్తా’ అని ప్రశాంత్ భూషణ్ అన్నారు. సీజేఐ జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే ప్రతిష్టకు భంగం కలిగేలా ట్వీట్లు చేశారంటూ ప్రశాంత్ భూషణ్ పై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. ఈ కేసులో ఆయనకు ఆరు నెలల జైలు లేదా రూ.2 వేల వరకు జరిమానా లేదా రెండూ కలిపి శిక్ష విధించే అవకాశం ఉంది.

For More News..

రెండేళ్లలో కరోనాకు వ్యాక్సిన్ రాకుంటే 10 లక్షల మంది తగ్గుతరట

టీచర్లకు చెప్పొస్తలె.. పిల్లలకు సమజైతలె

11 రోజుల్లో ఢిల్లీలో రికార్డు వర్షం