
సిద్దిపేట రూరల్, వెలుగు: ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనట్లు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ ఆఫీస్లో సీపీ శ్వేత తో కలసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నామినేషన్ వేయడానికి లాస్ట్ డేట్10వ తేదీ అని, 13వ తేదీన నామినేషన్ల స్క్రూటీనీ, 15న విత్ డ్రా, 30న పోలింగ్ జరుగుతుందన్నారు.
నామినేషన్ విత్ డ్రా అయిన తర్వాత రెండో రాండమైజేషన్ నిర్వహించి ఉద్యోగులను ఈవీఎంలను కేటాయిస్తామన్నారు. నామినేషన్ వేసిన అభ్యర్థి 24 గంటల్లోగా అఫిడవిట్ ను అప్‌లోడ్ చేయాలని, సంబంధిత రిటర్నింగ్ అధికారి అఫిడవిట్ ను నోటీస్ బోర్డ్ పై ఉంచుతారని పేర్కొన్నారు. సీపీ శ్వేత మాట్లాడుతూ.. నామినేషన్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 100 మీటర్ల వరకు 144 సెక్షన్ విధించామన్నారు. క్యాండిడేట్అతని వెంట నలుగురికి మాత్రమే నామినేషన్ కేంద్రంలోకి వెళ్లడానికి అనుమతి ఉంటుందన్నారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేసే వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.