ఓటు ఎలా వేయాలో అవగాహన కల్పిస్తాం : ప్రశాంత్ జీవన్ పాటిల్

సిద్దిపేట టౌన్, వెలుగు: ఓటు వేసే విధానంపై ఓటర్లకు అవగాహన కల్పించేందుకు  ప్రతి పోలింగ్ కేంద్రంలో ఫ్లెక్సీని ప్రదర్శిస్తామని జిల్లా ఎన్నికల అధికారి , కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. మంగళవారం కలెక్టర్ ఆఫీస్​లో ఈవీఎం ద్వారా ఓటు వేసే విధానంపై  ముద్రించిన ఫ్లెక్సీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ రూమ్ లోకి వెళ్లిన తర్వాత ఎంచుకున్న అభ్యర్థి కి ఎలా ఓటు వేయాలో ఫ్లెక్సీలో  క్లియర్ గా ఉందన్నారు.

అనంతరం కలెక్టరేట్ సమీపంలో నిర్మిస్తున్న స్ట్రాంగ్ రూం ల పనులను పరిశీలించారు. ఎలక్ట్రిసిటీ కలెక్షన్, సీసీ కెమెరాలు,  స్ట్రీట్ లైట్ల ఏర్పాటు, ఫస్ట్ లెవల్ చెకింగ్ హాల్ పనులను పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆర్అండ్ బీ ఈఈ రాములు, డీఈ వెంకటేశ్ ను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో డీపీఆర్‌‌వో  రవికుమార్, ఎలక్షన్ సూపరింటెండెంట్  రామేశ్వర్ పాల్గొన్నారు.

ALSO READ : కాంగ్రెస్ వస్తే ఆరు నెల్లకో సీఎం : మంత్రి హరీశ్ రావు