మోదీ కాళ్లు మొక్కి.. నితీశ్ బీహార్ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు : ప్రశాంత్ కిషోర్

మోదీ కాళ్లు మొక్కి.. నితీశ్ బీహార్ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు : ప్రశాంత్ కిషోర్

బీహార్ రాజకీయాలు.. సీఎం నిశీష్ కుమార్ పై సంచలన కామెంట్స్ చేశారు ప్రశాంత్ కిషోర్. పార్లమెంటరీ పార్టీ మీటింగ్ సమయంలో.. ప్రధాని మోదీ కాళ్లు మొక్కటానికి ప్రయత్నించిన సీఎం నితీశ్ కుమార్.. బీహార్ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టారని.. బీజేపీ కాళ్ల దగ్గర బీహార్ ప్రజల ఆత్మ గౌరవాన్ని పెట్టారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారాయన.

ఎన్డీయే సమావేశంలో మోదీ పాదాలను నితీశ్ కుమార్ తాకడం సరికాదన్నారు. ఒక రాష్ట్ర  ముఖ్యమంత్రి అంటే ఆ రాష్ట్ర ఆత్మగౌరవానికి ప్రతీక అలాంటి వ్యక్తి ప్రధాని నరేంద్రమోదీ పాదాలను తాకి బీహార్ అవమానపడేలా చేశారని విమర్శించారు.  గతంలో నితీశ్ కుమార్‌తో కలిసి పని చేసి ఇప్పుడు ఆయనను ఎందుకు విమర్శిస్తున్నారని కొంతమంది తనను ప్రశ్నిస్తున్నారని ఆ రోజు ఈ ముఖ్యమంత్రి ఇప్పటిలాగా లేరని చెప్పారు. 

 అప్పుడు ఆయన తన మనస్సాక్షిని అమ్మకానికి పెట్టలేదన్నారు. ఇప్పుడు బీహార్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని మండిపడ్డారు. మోదీ మూడోసారి ప్రధాని కావడంలో నితీశ్ కుమార్ పాత్ర ఎంతో ఉందని చర్చలు సాగుతున్నాయని కానీ ముఖ్యమంత్రి మాత్రం రాష్ట్ర ప్రయోజనాల కోసం తనకున్న బలాన్ని వినియోగించుకోవడం లేదని ఆరోపించారు.