నేను గెలిస్తే..మద్యనిషేదం ఎత్తేస్తా: ప్రశాంత్​కిషోర్​పార్టీ హామీ

నేను గెలిస్తే..మద్యనిషేదం ఎత్తేస్తా: ప్రశాంత్​కిషోర్​పార్టీ హామీ

తమ పార్టీ అధికారంలోకి వస్తే..బీహార్​లో తక్షణమే మద్య నిషేధాన్ని రద్దు చేస్తానని ప్రశాంత్​కిషోర్ ప్రజలకు హామీ ఇచ్చారు. జన్​ సూరజ్​పార్టీ  ప్రారంభోత్సవం సందర్భంగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్​కిషోర్ పలు కీలక విషయాలపై మాట్లాడారు. ​ 

బీహార్​ లో మద్య నిషేధం వల్ల ప్రభుత్వానికి ఏటా 20వేల కోట్ల నష్టం వాటిల్లుతుందని అన్నారు. మద్యపాన నిషేధం ఎత్తివేస్తే ప్రభుత్వానికి నిధులు సమకూరుతాయి. వాటిని బీహార్​ లో విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు వినియోగిస్తామన్నారు ప్రశాంత్​ కిషోర్. రాబోయే 10 యేళ్లలో బీహార్​లో ప్రపంచస్థాయి విద్యావ్యవస్థను నెలకొల్పేందుకు 5లక్షల కోట్లు అవసరం ఉందన్నారు ప్రశాంత్​ కిషోర్.

Also Read :- బిడ్డను కరిచిందని..కుక్కను కిరాతకంగా చంపాడు

రెండేళ్ల క్రితం 2022 మే5న జన్​సూరజ్​పార్టీ ఏర్పాటు చేశాం..అప్పటినుంచి ప్రజల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నాం.. ఇటీవల జన్​సూరజ్​పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం లభించిందన్నారు ప్రశాంత్​కిషోర్.  
గత లోక్ సభలో ఎన్నికల్లో ప్రజలు అహంకారాన్ని సహించరని రుజువైంది. ప్రజలు దేన్నయినా తట్టుకుంటారు గానీ అహంకారాన్ని కాదు.. అది బీజేపీ అయినా,, కాంగ్రెస్​ అయినా, ప్రాంతీయ పార్టీలైనా.. ఎక్కడ చూసినా ప్రజలు అహంకారాన్ని అతివిశ్వాసంపై గుర్రుగా ఉన్నారని ప్రశాంత్​ కిషోర్ అన్నారు. 
ఏ నాయకుడైనా వాటిని తేలికగా తీసుకోకూడదని స్పష్టమైన మేసేజ్ ని పంపారని ప్రశాంత్​ కిషోర్​అన్నారు. పోల్​ ఫలితాలు రాహుల్ గాంధీ కాంగ్రెస్​నాయకత్వంపై వచ్చిన ప్రశ్నలకు సమాధానం చూపించాయని.. అయితే దేశం రాహుల్​ ను నాయకుడిగా అంగీకరించేందుకు ఇంకా కొంత సమయం పడుతుందన్నారు ప్రశాంత్​ కిషోర్.