నా ఫీజు 100 కోట్ల రూపాయలపైనే.. నా దగ్గర డబ్బు లేదనుకోవద్దు : ప్రశాంత్ కిషోర్

నా ఫీజు 100 కోట్ల రూపాయలపైనే.. నా దగ్గర డబ్బు లేదనుకోవద్దు : ప్రశాంత్ కిషోర్

మాజీ ఎన్నికల వ్యూహకర్త.. జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బీహార్ ఎన్నికల్లో పోటీపై ప్రచారం ముమ్మరం చేశారాయన. రాబోయే బీహార్ ఎన్నికల్లో సత్తా చాటుతానంటూ ఇప్పటికే సవాళ్లు చేసిన ఆయన.. ఓ సభలో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

జన్ సూరజ్ పార్టీకి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి.. ఎలా ఖర్చు పెడుతున్నారు అంటూ కొంత మంది విమర్శలు చేస్తున్నారు.. వాళ్లకు ఇదే నా సమాధానం అంటూ అసలు విషయాన్ని బయటపెట్టారు ప్రశాంత్ కిషోర్..

నేను ఎన్నికల వ్యూహకర్తగా ఒక్క డీల్ కు కనీసం 100 కోట్ల రూపాయలు తక్కువ కాకుండా తీసుకుంటాను.. నా వ్యూహాలతో దేశంలో 10 రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తున్నాయి.. నా దగ్గర డబ్బులు లేవనుకోవద్దు.. వందల కోట్లు ఉన్నాయంటూ అసలు విషయాన్ని బయటపెట్టారు. బీహార్ రాజకీయాల్లో రాబోయే ఎన్నికలకే కాదు.. ఆ తర్వాత ఎన్నికల వరకు ఖర్చు పెట్టటానికి.. పార్టీని నడిపించటానికి నా దగ్గర డబ్బులు ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు ప్రశాంత్ కిషోర్..

Also Read : జమ్మూ కాశ్మీర్‎లో ఎన్ కౌంటర్

ప్రశాంత్ కిషోర్ 2014లో బీజేపీ ఆధ్వర్యంలోని మోదీకి పని చేశారు.. 2015లో బీహార్ లో జనతాదళ్ పార్టీకి పని చేశారు.. 2017లో యూపీలోని కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరించారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి.. 2021లో పశ్చిమ బెంగాల్ లోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి.. ఆ తర్వాత తమిళనాడులోని డీఎంకే పార్టీకి.. 2020లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పని చేశారు.

ఒక్కో పార్టీ దగ్గర కనీసంలో కనీసం 100 కోట్ల రూపాయలు తీసుకున్నా.. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ దగ్గర వేల కోట్ల డబ్బు ఉందని.. ఆయన పరోక్షంగానే చెప్పుకొచ్చారు.

బీహార్ రాష్ట్రంలో త్వరలో నాలుగు అసెంబ్లీ నియోజకర్గాల్లో ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. బెలగంజ్, ఇమామ్ గంజ్, రాంగఢ్, తరారీ స్థానాల్లో జన సూరజ్ పార్టీ తరపున బలమైన అభ్యర్థులను బరిలోకి దించబోతున్నట్లు కూడా స్పష్టం చేశారు ప్రశాంత్ కిషోర్. ఎన్నికలు కొత్త కాదు.. ఎన్నికలు ఎలా నడుస్తాయో కూడా ప్రశాంత్ కిషోర్ కు బాగా తెలుసు.. అలాంటాయన డబ్బు లేకుండా రాజకీయాలు ఎలా చేస్తారని అనుకున్నారో ఏమో..