Prashanth Kishore: మేం అధికారంలోకి వస్తే..గంటలోపే మద్యపాన నిషేధం ఎత్తివేస్తా:ప్రశాంత్ కిషోర్

జనసురాజ్ పార్టీ అధ్యక్షుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీహార్ లో అధికారంలోకి వస్తే.. గంటలోపే మద్యపాన నిషేధం ఎత్తివేస్తామన్నారు. బీహార్ లో మధ్యనిషేధం అవసరం లేదన్నారు. అక్టోబర్ న తన పార్టీ, జన సురాజ్ పార్టీ వ్వవస్థాపక దినోత్సవం సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదన్నారు. ఆ అవసరం కూడా లేదన్నారు.

ALSO READ : రెండు రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తా.. కేజ్రీవాల్ సంచలన ప్రకటన

బీహార్లో ప్రస్తుతం అమలులో ఉన్న మద్యపాన నిషేధం పనికిరాదు.. ఇది మద్యం అక్రమ హోండెలివరీలకు దారితీసిందని ప్రశాంత్ కిషోర్ విమర్శించారు. వేల కోట్ల ఎక్సైజ్ ఆదాయాన్ని బిహార్ కోల్పోయిందని పేర్కొన్నారు. మద్యం అక్రమ వ్యాపారం చేస్తూ రాజకీయ నేతలు, అధికారులు లబ్ధిపొందుతున్నారని ఆరోపించారు ప్రశాంత్  కిషోర్.  

ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ పాదయాత్ర గురించి అడిగినప్పుడు వ్యంగ్యంగా స్పందించారు ప్రశాంత్ కిషోర్. కనీసం ఇప్పుడైనా ఇల్లువదిలి ప్రజల్లోకి వచ్చాడు.. సంతోషం.. తొమ్మిదో తరగతి కూడా పూర్తి చేయని వ్యక్తి రాష్ట్రాభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడని అన్నారు. తేజస్వీ యాదవ్ కు జీడీపీకి, జీడీపీ గ్రోత్ కు తేడా తెలియదన్నారు. ప్రస్తుతం బీహార్ లో అధికారంలో ఉన్న జేడీయూతోపాటు ఆర్జేడీ కూడా రాష్ట్రాన్ని నాశనం చేసిందని ఆరోపించారు.