సాగర తీరాన నిలువెత్తు సాక్ష్యం.. సీఎం రేవంత్ వ్యాఖ్యలకు ప్రశాంత్ రెడ్డి కౌంటర్

హైదరాబాద్: బీఆర్ఎస్​హయాంలో అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎక్కడా ఆవిష్కరించలేదని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పందించారు. హుస్సేన్ సాగర తీరాన అమరవీరుల స్మారక చిహ్నం ప్రాంగణంలో కొలువుదీరిన పసిడి వర్ణం తెలంగాణ తల్లి విగ్రహమే నిలువెత్తు సాక్ష్యం అని స్పష్టంచేశారు. ‘అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ.. తెలంగాణ తల్లి దీవెనలతో నా రాష్ట్రం పసిడి తెలంగాణగా విరాజిల్లాలని కేసీఆర్  జూన్ 22 ,2023 నాడు తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం ప్రారంభోత్సవంతో పాటు తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ఆవిష్కరించారు’ అని ట్వీట్ చేశారు.