
కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రస్తుతం జూ. ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎన్టీఆర్ దేవర సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు. దీంతో ఫ్యామిలీతో కలసి విదేశాల్లో టూర్లు, ట్రిప్పులు అంటూ తిరుగుతున్నాడు. ఎన్టీఆర్ ఇటీవలే ట్రిప్ ని కంప్లీట్ చేసుకుని వచ్చాడు. దీంతో ప్రశాంత్ నీల్ షూటింగ్ షెడ్యూల్ లో పాల్గనబోతున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఈ సినిమా రెండో షెడ్యూల్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతోంది. దీంతో శుక్రవారం నుంచి ఎన్టీఆర్ కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే యాక్షన్ సీక్వెన్స్ కోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్స్ నిర్మించి వందల మంది జూనియర్ ఆర్టిస్టులతో షూట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ సినిమా రిలీజ్ ఉంటుందని దీంతో ప్రశాంత్ నీల్ డార్క్ యాక్షన్ సినిమాతో తారక్ ఫ్యాన్స్ కి ఫుల్ ప్యాక్డ్ ఎంటర్ టైన్ మెంట్ అందించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఎన్టీఆర్ హిందీలో వార్ 2 సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో హృతిక్ రోషన్ తో కలసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. గతంలో హృతిక్, మరో స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ కలసి నటించిన వార్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీంతో ఈసారి సౌత్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ ఎన్టీఆర్ ని కూడా తీసుకోవడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.