ఎన్టీఆర్-నీల్ సినిమా స్టోరీ ఇదేనా.. ఈ జోనర్ లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్..

ఎన్టీఆర్-నీల్ సినిమా స్టోరీ ఇదేనా.. ఈ జోనర్ లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్..

కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ టాలీవుడ్ యంగ్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ప్రముఖ తెలుగు సినిమా నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ కలసి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. గురువారం ఈ సినిమా మొదటి షెడ్యూల్ మొదలైంది. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ సీన్స్ ని షూట్ చేస్తున్నారు. మైత్రే మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో షూటింగ్ జరుగుతున్న సమయంలో తీసిన పోస్టర్ ని షేర్ చేసింది. దీంతో ఈ సినిమా స్టోరీ చర్చనీయాంశంగా మారింది. 

అయితే ఎన్టీఆర్ నీల్ సినిమా 1960లో కలకత్తా బ్యాక్ డ్రాప్ లో పవర్ఫుల్ పీరియాడిక్ డ్రామాగ ఉన్నట్లు ట్యాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఎన్టీఆర్ ఈ సినిమాలో డబుల్ యాక్షన్ చేస్తున్నాడని దీంతో ప్రశాంత్ ఎన్టీఆర్ ని రెబల్ లుక్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కలకత్తా బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇందులో మెగాస్టార్ చిరంజీవి (చూడాలని ఉంది), గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (నాయక్), విక్టరీ వెంకటేష్ (లక్ష్మి), తదితరులు బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నారు. అయితే ఎన్టీఆర్ కూడా అదుర్స్, ఆంధ్రావాలా సినిమాలతో అలరించాడు. దీంతో ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. 

ఈ విషయం ఇలా ఉండగా గత ఏడాది రిలీజ్ అయిన తారక్ సినిమా దేవర బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహించగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించాడు. దేవర  సినిమా వరల్డ్ వైడ్ గా దాదాపుగా రూ.675 కోట్లు కలెక్షన్స్ సాధించింది. దీంతో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రశాంత్ నీల్ గతంలో తీసిన కేజీఎఫ్, సలార్  సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. దీంతో ఈసారి ఎన్టీఆర్ తో రూ. వెయ్యికోట్లు కొల్లగొడతాడని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.