
శ్రీమురళి, రుక్మిణి వసంత్ జంటగా డాక్టర్ సూరి డైరెక్ట్ చేసిన కన్నడ చిత్రం ‘బఘీర’. దర్శకుడు ప్రశాంత్ నీల్ కథను అందించగా, హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించారు.
దీపావళి కానుకగా అక్టోబర్ 31న సినిమా విడుదల కానుంది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పీ ద్వారా ఈ చిత్రం తెలుగులో రిలీజ్ అవుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు.
దేవుని అవతారాల గురించి తల్లి, కొడుకు మధ్య సీరియస్ సంభాషణతో ప్రారంభమైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. అరాచకాలని అంతం చేయడానికి దేవుడు అనేక రూపాల్లో వస్తాడని, దేవుడి లాగానే కాదు రాక్షసుడిలా కూడా రావచ్చని తల్లి చెప్పడం ఇంటరెస్టింగ్‌గా ఉంది. థ్రిల్లింగ్ యాక్షన్ సీన్స్, శ్రీమురళి పెర్ఫార్మెన్స్ ఆకట్టుకున్నాయి.
ఇకపోతే ప్రశాంత్ నీల్ దర్శకుడిగా సాండల్‌వుడ్‌లోకి అరంగేట్రం చేస్తూ రూపొందించిన కన్నడ మూవీ ఉగ్రం. శ్రీమురళి హీరోగా నటించిన ఈ గ్యాంగ్‌స్టర్ సినిమా ఆధారంగానే ప్రభాస్ సలార్ రూపొందినట్లు కొన్నాళ్లుగా పుకార్లు వినిపిస్తోన్నాయి.
ఉగ్రం సినిమా యూ ట్యూబ్‌లో ఉంది. ప్రశాంత్ నీల్ గ్యాంగ్‌స్టర్ ట్రెండ్‌కు ఆరంభంగా నిలిచిన ఈ సినిమా మాస్ ఆడియెన్స్‌ను మెప్పిస్తుంది. కేజీఎఫ్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంటుంది.
ప్రశాంత్ నీల్ కథకు..తన సినీ ఎంట్రీకి సరైన హీరో ఇతనే అని చాలా సందర్భాల్లో నీల్ చెప్పుకొచ్చాడు.ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబోలో మూవీ వస్తుండటంతో శ్రీ మురళి లెవెల్ తెలుగు ఆడియన్స్ కి కూడా తెలిసిపోతుంది.