డైరెక్టర్ ప్రశాంత్ నీల్ బర్త్ డే వేడుకలు

స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. బెంగుళూరులో జరిగిన బర్త్ డే పార్టీలో  ప్రభాస్, యష్ సందడి చేశారు.  ఇద్దరు పాన్ ఇండియా స్టార్లు ప్రభాస్, యష్తో..పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఒకే ఫ్రేమ్లో కనిపించడంతో..అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.  హోంబలే ప్రొడక్షన్స్ షేర్ చేసిన ప్రశాంత్ నీల్ బర్త్ డే పార్టీకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఇదే పార్టీలో కేజీయఫ్-2 మూవీ 50 రోజుల వేడుకను నిర్వహించారు. ఇక ప్రశాంత్ నీల్ మూడు సినిమాలే డైరెక్ట్ చేసినా....పాపులారిటీ మాత్రం ఉహించని స్థాయిలో సంపాదించుకున్నారు . కేజీయఫ్ మూవీతో పాన్ ఇండియా డైరెక్టర్గా మారిపోయారు. ఇక తాజాగా రిలీజైన కేజీయఫ్-2 సంచలన రికార్డులతో దూసుకుపోతుంది. ఈ మూవీ వెయ్యి కోట్ల క్లబ్ చేరింది. ఈ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్నాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్‌లో లాంగ్ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్‌లో శ్రుతి హాసన్ కూడా పాల్గొంటోంది. సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో మూవీని ప్లాన్ చేశాడు.  సలార్ మూవీ షూటింగ్  పూర్తయిన తర్వాత తారక్ సినిమా పట్టాలెక్కనుంది.