నిజామాబాద్, వెలుగు: వానాకాలం పంటల సాగు విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందొద్దని, కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా సాగుకు నీరందిస్తామని మంత్రి ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో ఉమ్మడి జిల్లా ఇరిగేషన్ ఆఫీసర్లతో మీటింగ్ నిర్వహించారు. ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ కింద సాగు చేసే పంటలకు ఈ సీజన్లో 50 టీఎంసీల నీరు అవసరం కాగా, 20 టీఎంసీల నీరు ప్రాజెక్టులో ఉందన్నారు. మిగతా 30 టీఎంసీలను రోజుకు 0.5 టీఎంసీల చొప్పున కాళేశ్వరం నుంచి లిఫ్ట్చేయడానికి పంపుహౌస్‌లను సిద్ధం చేయాలని సీఈ సుధాకర్‌రెడ్డిని మంత్రి ఆదేశించారు.
నిజాంసాగర్ప్రాజెక్ట్లోని 5 టీఎంసీలను వానాకాలం పంటలకు అందించేలా ప్లాన్ రూపొందించి, విడుదల చేయాలని సీఈ శ్రీనివాస్‌రెడ్డికి చెప్పారు. గుత్పా, అలీసాగర్, లక్ష్మీకెనాల్, చౌట్పల్లి హన్మంత్‌రెడ్డి లిఫ్టులను కాకతీయ కెనాల్ఆయకట్టుకు కావాల్సిన సాగునీటి ప్రణాళికను రూపొందించాలని సీఈ మధుసూదన్‌కి సూచించారు.