హనుమాన్ను ఆపాలని చూస్తున్నారు.. కామెంట్స్లో బూతులు తిడుతున్నారు.. ప్రశాంత్ వర్మ షాకింగ్ కామెంట్స్

హనుమాన్ను ఆపాలని చూస్తున్నారు.. కామెంట్స్లో బూతులు తిడుతున్నారు.. ప్రశాంత్ వర్మ షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ(Prashanth Varma) తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ హనుమాన్(HanuMan). తెలుగులో వస్తున్న మొదటి సూపర్ హీరో మూవీ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. టీజర్, ట్రైలర్ ఆ అంచనాలు నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లాయి. యంగ్ హీరో తేజ సజ్జ, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, గెటప్ శ్రీను ప్రధాన పాత్రల్లో వస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

అయితే ఈ సినిమాను ఆపేయాలని చుస్తున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు దర్శకుడు ప్రశాంత్ నీల్. కారణం 2024 సంక్రాంతి కానుకగా తెలుగు నుండి ఐదు సినిమాలు లైన్లో ఉన్నాయి. అందులో గుంటూరు కారం, నాసామి రంగ, సైంధవ్, ఈగల్.. ఇలా వరుస సినిమాలు రిలీజ్ కు సిదంగా ఉన్నాయి. దీంతో హనుమాన్ సినిమాను రేస్ నుండి తప్పించాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారట. కావాలనే ఆ సినిమాకు ఇబ్బదులు క్రియేట్ చేస్తున్నారట. ఇదే విషయాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. 

హనుమాన్ సంక్రాంతికి వస్తున్నందుకు కొంతమంది కోపంగా ఉన్నారు. అది నేను ఫేస్‌ చేస్తున్నాను కూడా. దానికి చాలా ఫీలవుతున్నాను. సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు. నాకు ఇలా వేరేవాళ్లతో తిట్టించుకోవటం ఎప్పుడు జరగలేదు. నా పని నేను చేసుకుంటాను అంతే. నిజానికి ఈ నెగిటివిటీని నేను పాజిటివ్‌ గానే తీసుకుంటున్నాను. వాళ్ళు మా సినిమాను కూడా నెగిటివ్‌ చేసే అవకాశం ఉందని నాకు అనిపిస్తోంది. సెన్సార్‌ విషయంలో కూడా అడ్డంకులు సృష్టించారు. అది కూడా చాలా కష్టపడి సాల్వ్‌ చేశాం. ఇదంతా ఎవరు చేస్తున్నారో తెలియదు. వాళ్ళతో వెళ్లి గొడవ పెట్టుకోలేను కదా.. అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు ప్రశాంత్. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.