ఇవాళ ప్రశాంతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం

ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మంలోని నెహ్రూ నగర్ లో కొత్తగా నిర్మించిన ప్రశాంతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను శుక్రవారం ప్రారంభిస్తున్నట్లు హాస్పిటల్ చైర్మన్, జనరల్ మెడిసిన్ డాక్టర్ కేసోజు భరత్ బాబు తెలిపారు. గురువారం ప్రశాంతి హాస్పిటల్ ఓల్డ్ బిల్డింగ్ లోని అన్ని విభాగాల డాక్టర్ల బృందంతో   ఆయన మీడియాతో మాట్లాడారు.

హాస్పిటల్ ప్రారంభోత్సవానికి మంత్రులు భట్టి విక్రమార్క తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరుకానున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత, ఎంపీ నామా నాగేశ్వరరావు, అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటారని చెప్పారు.  పదేండ్లుగా జిల్లా ప్రజలకు వైద్య సేవలను అందిస్తూ వారి మన్ననలను పొందామని తెలిపారు. డాక్టర్లు  టీ.ప్రసాద్, వీ.భాస్కర్, కృష్ణ ప్రసాద్, వీ.జీవన్ కుమార్, బీ.గౌతమ్ వినయ్, హేమంత్ పాటిబండ్ల, రాజ్ కుమార్, పీఆర్వో మధు పాల్గొన్నారు.