ఎలక్షన్​టైంలో అలర్ట్ గా వర్క్​ చేయాలి: ప్రశాంత్​ జీవన్​పాటిల్​

ఎలక్షన్​టైంలో అలర్ట్ గా వర్క్​ చేయాలి: ప్రశాంత్​ జీవన్​పాటిల్​

హుస్నాబాద్​, వెలుగు : ఎలక్షన్​టైంలో రిటర్నింగ్​ఆఫీసర్లు, సిబ్బంది అలర్ట్​గా ఉంటూ వర్క్​చేయాలని జిల్లా ఎలక్షన్​ ఆఫీసర్​, కలెక్టర్​ ప్రశాంత్​జీవన్​పాటిల్ ​అన్నారు. సోమవారం ఆయన హుస్నాబాద్​లోని ఎలక్షన్​ రిటర్నింగ్​ ఆఫీసర్​కార్యాలయంతో పాటు ఎలక్షన్​ స్ట్రాంగ్​రూమ్​, డిస్ట్రిబ్యూషన్​ సెంటర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్​ వేసేందుకు వచ్చేటప్పుడు ఐవోసీ బిల్డింగ్​కు వంద మీటర్ల దూరంలోనే కార్యకర్తలను ఆపాలని, ర్యాలీలు చేయకుండా చూడాలని సూచించారు.

 నామినేషన్లు వేసే అభ్యర్థులను మాత్రమే లోపలికి అనుమతించాలన్నారు. వారి వాహనాలకు పార్కింగ్​ సదుపాయం, వాటర్​ ఫెసిలిటీ కల్పించాలని చెప్పారు. అనంతరం మోడల్ స్కూల్​లోని ఎలక్షన్ స్ట్రాంగ్ రూమ్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను పరిశీలించారు. ఏదైనా టెక్నికల్​ ప్రాబ్లమ్​ ఎదురైతే వెంటనే ఆర్వోకు సమాచారాన్ని అందించాలన్నారు. పటిష్ట భద్రత ఏర్పాటుచేయాలని ఏసీపీ సతీశ్​ను ఆదేశించారు. గ్రౌండ్​లో ముండ్లపొదలు, రాళ్లు రప్పలు లేకుండా మొరంతో చదునుచేయించాలని మున్సిపల్​ కమిషనర్​ రాజశేఖర్ కు సూచించారు.