కలిసికట్టుగా.. బీజేపీ అభ్యర్థిని గెలుపించుకుందాం: ప్రతాప రామకృష్ణ

వేములవాడ, వెలుగు : బీజేపీ  వేములవాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీ ఎవరిని ప్రకటించినా అందరం కలిసి కట్టుగా గెలిపించుకుందాం అని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ అన్నారు. అదివారం పట్టణంలోని భీమేశ్వర గార్డెన్స్​లో వేములవాడ అసెంబ్లీ 256 బూత్ కమిటీ అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా లీడర్లు మాట్లాడుతూ బీజేపీ బలంగా ఉందని, ఇప్పటికే ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు.

బీఆర్​ఎస్​ గత ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి, నెరవేర్చలేదని విమర్శించారు. బీఆర్​ఎస్​ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పారు. ఎలాగైనా స్థానికంగా బీజేపీని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  బీజేపీ లీడర్లు డా. వికాస్​ రావు, తుల ఉమ, ఎర్రం మహేశ్, జిల్లా ఇన్​చార్జి గంగాడి మోహన్ రెడ్డి, పార్లమెంట్ ఇన్​చార్జి పల్లె గంగా రెడ్డి, అసెంబ్లీ ఇన్​చార్జి బాలాగౌడ్, అసెంబ్లీ కన్వీనర్ మార్తా సత్తయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, సంతోష్​ బాబు పాల్గొన్నారు.