హైదరాబాద్లో ప్రతిమ హాస్పిటల్ సీజ్.. ఇక నుంచి ఆ ఏరియాలో వేరే ఆస్పత్రి చూసుకోవాల్సిందే

హైదరాబాద్లో ప్రతిమ హాస్పిటల్ సీజ్.. ఇక నుంచి ఆ ఏరియాలో వేరే ఆస్పత్రి చూసుకోవాల్సిందే

హైదరాబాద్ లో ప్రతిమా హాస్పటల్ ను సీజ్ చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. దాదాపు అన్ని మెయిన్ ఏరియాల్లో బ్రాంచ్ లు ఏర్పాటు చేసి విస్తరించిన ప్రతిమ ఆస్పత్రి సీజ్ కావడం సంచలనం రేపుతోంది. తాజాగా కాచిగూడ ఏరియాలోని బ్రాంచ్ ను అధికారులు సీజ్ చేశారు. 

హాస్పిటల్ లోని కంప్యూటర్స్, ల్యాప్ టాప్స్, ఫర్నీచర్ మొదలైన అన్నింటిని సీజ్ చేశారు అధికారులు. హాస్పిటల్ లో ఉన్న స్టాఫ్ అందరినీ బయటకు పంపించి సీజ్ చేశారు. దీంతో సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. 

Also Read:- బైక్ రైడర్, ఇన్ఫ్లుయెన్సర్ భయ్యా సన్నీ యాదవ్ పై కేసు నమోదు..

హాస్పిటల్ సీజ్ చేయడానికి గల కారణం పన్నులు చెల్లించకపోవడం. 2022 అక్టోబర్ నుంచి 2025 మార్చ్ వరకు ప్రాపర్టీ టాక్స్ పే చేయనందున సీజ్ చేశారు. ఎన్ని సార్లు నోటీసులు ఇచ్చినా హాస్పిటల్ యాజమాన్యం టాక్స్ కట్టకపోవడంతో చివరికి సీజ్ చేశారు. 

హాస్పిటల్ లోని అడ్మిన్ రూమ్  తో పాటు కంప్యూటర్స్ , ల్యాప్ టాప్స్ , సోఫా, ఫర్నిచర్ ను సీజ్ చేసి పోస్టర్ అంటించారు అధికారులు.