రాష్ట్రంలో సంచలనంగా మారిన ప్రవళిక ఆత్మహత్య కేసులో నిందితుడు శివరాం రాథోడ్ శుక్రవారం(అక్టోబర్ 20) నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. అక్టోబర్ 13న వరంగల్ జిల్లా బిక్కాజిపల్లికి చెందిన ప్రవళిక.. హైదరాబాద్ చిక్కడపల్లిలోని హాస్టల్ గదిలో ఆత్మత్య చేసుకుంది. శివరాం వేధింపుల వల్లే.. ప్రవళిక ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు వెల్లడించారు.
నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. శివారం అరెస్టును పోలీసులు ధ్రువీకరించాల్సి ఉంది. అతన్ని కోర్టులో ప్రవేశపెట్టాక.. కస్టడీ రిమాండ్ కోరే విషయాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. శివరాంను విచారిస్తే.. ప్రవళిక కేసుకు సంబంధించిన మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.