రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యునిగా ప్రవీణ్ బాధ్యతల స్వీకరణ

బెల్లంపల్లి, వెలుగు: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యునిగా మంచిర్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం హైదరాబాద్​లోని ఎస్సీ, ఎస్టీ ఆఫీస్​లో జరిగిన కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సమక్షంలో ప్రవీణ్ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తనకు నమ్మకంతో ఇచ్చిన ఈ బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తానని.. దళిత, 
గిరిజనులకు అండగా  ఉంటానన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోరుకంటి చందర్, గువ్వల బాలరాజు, నోముల భగవత్, గాదరి కిషోర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్​లు రావుల శ్రీధర్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.